News December 28, 2024
నితీశ్ కుమార్ రెడ్డికి నగదు బహుమతి

AP: ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. అతడికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ACA ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. త్వరలో సీఎం చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ సిద్ధం చేస్తామని, అమరావతిలో ఇంటర్నేషనల్ సౌకర్యాలతో స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. నితీశ్ స్వస్థలం వైజాగ్.
Similar News
News November 10, 2025
భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.
News November 10, 2025
ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్‌గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.
News November 10, 2025
ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <


