News December 28, 2024

NZB: 2న జిల్లాకు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌

image

ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌ జస్టిస్‌ షమీం అక్తర్‌ గురువారం(జనవరి 2న) నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల సభ్యులు వర్గీకరణ విషయంపై దరఖాస్తులను కలెక్టరేట్‌లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

NZB: మత్తు మందు ఇచ్చి దొంగతనం.. ముఠా అరెస్ట్

image

వ్యాపారం పేరిట మాయమాటలు చెప్పి, మత్తు మందు కలిపిన బీరు ఇచ్చి నగలు దొంగిలించిన ముఠాను నిజామాబాద్ టౌన్-4 పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రసాద్, నర్సింగరావు, రుద్రా యాదవ్ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల్లో వీరు పలు నేరాలకు పాల్పడినట్లు ఎస్హెచ్ఓ సతీశ్ కుమార్ తెలిపారు.

News January 14, 2026

నిజామాబాద్: ఆర్టీసీ స్పెషల్ వసూళ్లు !

image

సంక్రాంతి నేపథ్యంలో నిజామాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోల నుంచి వివిధ రూట్లల్లో 500 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుండగా గ్రామీణా ప్రాంతాలకు వెళ్లే బస్సులు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లేవారి నుంచి స్పెషల్ పేరిట అదనంగా 50 శాతం పసూళ్లు చేస్తోందని, పండగపూట ఆర్టీసీ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

News January 13, 2026

బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.