News December 28, 2024

మన్మోహన్‌లా వాజ్‌పేయికీ జరిగితే BJP ఎలా ఫీలయ్యేది: కాంగ్రెస్ నేత

image

మన్మోహన్ స్మారక స్థలం కేటాయింపు అంశంలో BJPపై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ విమర్శలు కురిపించారు. రాజ్‌ఘాట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకానికి స్థలం ఇవ్వకపోతే మీ పార్టీ ఎలా ఫీలయ్యేదని ప్రశ్నించారు. ‘మనిషి చనిపోయిన వెంటనే శత్రుత్వాలన్నీ మన్నులో కలిసిపోతాయి. కానీ ఇక్కడా రాజకీయాలు చేస్తున్నారు. అటల్‌జీ విషయంలో ఇలాగే జరిగేతే మీకెలా ఉండేది? ఇది ఓ పార్టీ అంశం కాదు. దేశ చరిత్రది’ అని అన్నారు.

Similar News

News December 29, 2024

మాతృభాష తల్లి పాలలాంటిది: కందుల దుర్గేశ్

image

AP: మాతృ భాష తల్లిపాలలాంటిదని, పరాయి భాష పోతపాలలాంటిదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. గత ప్రభుత్వం తెలుగు భాషకు తూట్లు పొడిచింది. ఇంగ్లిష్ మీడియం పేరుతో తెలుగుకు ద్రోహం చేసింది. తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. యువత పుస్తకాలు చదివేలా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News December 29, 2024

టీమ్ ఇండియా WTC ఫైనల్ చేరాలంటే?

image

తొలిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా చేరుకుంది. మరో బెర్త్ కోసం భారత్‌కు ఆస్ట్రేలియా నుంచి తీవ్ర పోటీ నెలకొంది. మెల్‌బోర్న్ టెస్ట్ డ్రా చేసుకుని, తర్వాత జరిగే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాలి. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆసీస్ 0-1 తేడాతో ఓడిపోవాలి. లంకపై ఆస్ట్రేలియా ఎట్టిపరిస్థితుల్లో రెండు టెస్టులు గెలవకూడదు. ఇలా జరిగితే టీమ్ ఇండియా WTC ఫైనల్‌కు వెళ్తుంది.

News December 29, 2024

సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటన ఖరారు

image

AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మ.12.40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.