News December 28, 2024
హైడ్రా ఛైర్మన్‌గా సీఎం రేవంత్: రంగనాథ్

TG: హైడ్రా ఛైర్మన్‌గా CM రేవంత్ కొనసాగుతారని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటివరకు హైడ్రాకు 5,800 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ‘హైడ్రా పరిధిలో 8 చెరువులు, 12 పార్కులను కాపాడాం. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం. హైడ్రాతో ప్రజల్లో చైతన్యం పెరిగింది. కొత్తగా ఇల్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.
News October 27, 2025
గిరిజనులకు 89,845 దోమతెరలు: సత్యకుమార్

AP: అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీనివల్ల 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దోమలను సంహరించే మందును ఉపయోగించి తయారు చేసే ఈ దోమతెరలను 4 ఏళ్లవరకు వినియోగించొచ్చని తెలిపారు.
News October 27, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు గంటల వ్యవధిలోని <<18115652>>మరోసారి<<>> తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,13,000గా పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


