News December 28, 2024
అయోధ్యలో New Year జోష్.. హోటళ్లన్నీ ఫుల్
అయోధ్య పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఈ పది రోజుల్లో బాలరాముడిని లక్షలాది భక్తులు దర్శించుకుంటారని అంచనా. 2024 ముగింపు, 2025 ఆరంభాన్ని ఈ దివ్యధామంలో జరుపుకొనేందుకు చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. JAN 15 వరకు అయోధ్య, ఫైజాబాద్‌లో హోటళ్లన్నీ బుక్కయ్యాయి. డిమాండును బట్టి ఒక రాత్రికి రూ.10వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. టెంటులోని రామయ్య భవ్య మందిరంలో అడుగుపెట్టాక వచ్చిన తొలి CY 2025 కావడం విశేషం.
Similar News
News December 31, 2024
TODAY HEADLINES
☛ సత్య నాదెళ్లతో CM రేవంత్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
☛ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని TG అసెంబ్లీ తీర్మానం
☛ 2025లో BRS చీఫ్ ఎన్నిక: KTR
☛ ₹80,112crతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు: CM CBN
☛ APలో FEB 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు
☛ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను ఒంటరి చేశారు: పవన్
☛ ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం
☛ PSLV-C60 ప్రయోగం సక్సెస్
☛ BGT నాలుగో టెస్టులో INDపై AUS గెలుపు
News December 31, 2024
కండోమ్స్, ORSలతో న్యూఇయర్ పార్టీ ఇన్విటేషన్
మహారాష్ట్ర పుణేలో ఓ పబ్ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు యువతకు ఇన్విటేషన్ లెటర్‌తోపాటు కండోమ్‌లు, ORS ప్యాకెట్లను పంపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇన్విటేషన్ పొందిన వ్యక్తుల వాంగ్మూలాలను రికార్డు చేశామని వారు చెప్పారు.
News December 31, 2024
‘మ్యాడ్’ దర్శకుడితో మాస్ మహరాజా సినిమా?
‘మ్యాడ్’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ సక్సెస్ సాధించి, దానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందిస్తున్నారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఇటీవల ఆయన మాస్ మహరాజా రవితేజకు ఓ కథ వినిపించారని సినీ వర్గాలు వెల్లడించాయి. రవితేజ ఈ స్క్రిప్ట్‌ను ఓకే చేస్తే సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.