News December 28, 2024
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా: అభిమాని

రామ్ చరణ్ వీరాభిమాని సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపింది. త్వరలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు. ‘సినిమాకు ఇంకా 13రోజులే ఉంది. అభిమానుల ఎమోషన్స్‌ను పట్టించుకోవడం లేదు. ఈనెలాఖరు లేదా JAN 1 వరకు రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతాను’ అని రాసుకొచ్చాడు. కాగా దీనిపై స్పందించిన మేకర్స్ ప్రోగ్రామ్స్ ప్లాన్ ప్రకారం జరుగుతాయని చెప్పినట్లు సమాచారం.
Similar News
News December 26, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి రేటు రూ.9,000 పెరిగి రూ.2,54,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.770 పెరిగి రూ.1,40,020కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.700 పెరిగి రూ.1,28,350 పలుకుతోంది.
News December 26, 2025
ఫ్లాట్‌గా మొదలైన స్టాక్ మార్కెట్లు..

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 26,130 వద్ద, సెన్సెక్స్ 50 పాయింట్లు కోల్పోయి 85,350 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఎన్టీపీసీ, ట్రెంట్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉండగా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, టీసీఎస్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
News December 26, 2025
లిప్ లైనర్ వాడుతున్నారా?

లిప్‌స్టిక్ వేసుకొనేముందు లిప్ లైనర్ వాడటం ముఖ్యం. దీని వల్ల మీ లిప్‌స్టిక్ కిందికి, పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. అలాగే ఇది పెదాలకు సరైన షేప్ ఇస్తుందని చెబుతున్నారు. లైనర్‌తో పెదాల చుట్టూ ఔట్ లైన్ గీసి తర్వాత లిప్‌స్టిక్ వెయ్యాలి. లిప్‌స్టిక్ వేశాక తప్పనిసరిగా టిష్యూతో లిప్స్‌ని ప్రెస్ చేయండి. ఇది స్మడ్జింగ్, ఎక్స్‌ట్రా లిప్‌స్టిక్‌ని దూరం చేస్తుందని సూచిస్తున్నారు.


