News December 28, 2024

తప్పు చేస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కొల్లు రవీంద్ర

image

AP: తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరిపైనైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘పేర్ని నాని తప్పు చేయకపోతే నెలరోజులు ఎక్కడికి పారిపోయారు. భార్యను అడ్డుపెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారు. నాని తప్పు చేయనిది హైకోర్టుకు ఎందుకు వెళ్లారు? ఆయన మేనేజర్ ఎక్కడికి పారిపోయారు’ అని మంత్రి ఫైర్ అయ్యారు.

Similar News

News December 31, 2024

తెలంగాణ సిఫార్సు లేఖలపై చంద్రబాబు కీలక నిర్ణయం

image

AP: తిరుమలకు తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖల్ని ఆమోదించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చంద్రబాబు నిర్ణయానికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. MLA/MLC/MP నుంచి సోమవారం నుంచి గురువారం మధ్యలో ఏవైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనానికి 2 లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2 లేఖలు స్వీకరిస్తామని లేఖలో చంద్రబాబు తెలిపారు.

News December 31, 2024

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై కేసు కొట్టివేత

image

TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై 2019లో నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఆ ఏడాది ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన చేసిన దీక్ష నియమాల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. దానిపై ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం, కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది.

News December 31, 2024

2015 తర్వాత తొలిసారిగా ఢిల్లీలో ‘స్వచ్ఛ’ డిసెంబర్!

image

2015 తర్వాత వచ్చిన డిసెంబర్లలో ఢిల్లీలో అత్యంత తక్కువ కాలుష్యం ఈ ఏడాది డిసెంబరులోనే నమోదైందని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఈ నెల ప్రథమార్ధంలో బలమైన గాలులు, ద్వితీయార్థంలో రికార్డు స్థాయి వర్షాలు దీని వెనుక కారణాలని వివరించారు. ఇప్పటికీ ఏక్యూఐ ప్రమాదకర స్థాయిలోనే.. అంటే 295 పాయింట్ల వద్ద ఉంది. గుడ్డికంటే మెల్ల మిన్న అన్నట్లుగా ఈ 9ఏళ్లలో ఇది కొంచెం బెటర్ అయిందనేది అధికారుల ప్రకటనలో సారాంశం.