News March 16, 2024

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: మోదీ

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడటంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. మా ట్రాక్ రికార్డు బాగుంది. మేం చేసిన పనులే గెలిపిస్తాయి. దేశంలో ఎక్కడ చూసినా ప్రజలు ఒక్కటే చెబుతున్నారు. అబ్‌కి బార్ 400 పార్. ప్రతిపక్షాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయి. ఈసారి కూడా వాళ్లకు ఓటమి తప్పదు’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News March 2, 2026

యువవికాసం: 16.5L అప్లికేషన్లకు ఇచ్చింది జీరో

image

TG: యువతకు ఆర్థిక సాయం కోసం GOVT రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. దీనికి 2025-26 బడ్జెట్లో ₹6వేల CRను కేటాయించింది. ₹4 లక్షలు సబ్సిడీగా అందే ఈ పథకం కోసం 16.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత JUN 2న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరగాలి. కానీ చివరి నిమిషంలో ఆర్థిక శాఖ నిధులు లేవనడంతో జరగలేదు. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా? ఇచ్చినా అమలు చేస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News March 2, 2026

ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా!

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 1948-1979 వరకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే కావడం విశేషం. ఇరాన్‌కు సైనిక, వ్యవసాయ, టెక్నాలజీ పరంగా హెల్ప్ చేసింది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు అమెరికా-ఇజ్రాయెల్ ఒక్కటేనని, అది ‘లిటిల్ సైతాన్’ అని విమర్శించారు. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారడం ఇజ్రాయెల్‌కు ఇష్టం లేదు. అందుకే ఈ గొడవలు.

News March 2, 2026

పెరుగు తింటున్నారా?

image

పెరుగు తింటే దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని చాలా మంది అపోహ పడతారు. అయితే అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు. అందులోని ప్రోబయాటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. పాల కంటే పెరుగు సులభంగా జీర్ణం అవుతుందని చెప్పారు. బయట లభించే పెరుగు కంటే ఇంట్లోనే తాజాగా చేసుకోవడం ఉత్తమం అని, ఫ్రిజ్‌లో ఉంచింది కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు మంచిదని సూచిస్తున్నారు.
Share It