News December 28, 2024
ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం: బొత్స
AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.15,000 కోట్ల భారం మోపుతోందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ ప్రభుత్వం 7 నెలల్లోనే రూ.74 వేల కోట్ల అప్పు చేసింది. వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లతో కలిపి రూ.లక్ష కోట్ల అప్పు చేసింది. ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’ అని ఆయన నిలదీశారు.
Similar News
News December 31, 2024
గాజాపై దాడి పర్యవసానాలను ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సిందే: నిపుణులు
గాజాపై చేసిన యుద్ధం తాలూకు పర్యవసానాలను ఇజ్రాయెల్ కచ్చితంగా ఎదుర్కోవాల్సిందేనని UN నిపుణులు తాజాగా తేల్చిచెప్పారు. ‘గాజాలోని పౌరుల్ని ఇజ్రాయెల్ చంపింది. దానికి మిత్రదేశాలు అండగా నిలిచాయి. ఘర్షణల్లో అమాయక పౌరులకు హాని కలగకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఏ చట్టాన్నీ పట్టించుకోలేదు. అన్నింటినీ ఉల్లంఘించింది. గాజా యుద్ధంలో ఇప్పటివరకు 45,500మంది చనిపోయారు’ అని పేర్కొన్నారు.
News December 31, 2024
‘డాకు మహరాజ్’.. థియేటర్లలో శివతాండవమే: నాగవంశీ
సంక్రాంతికి విడుదల కానున్న బాలకృష్ణ డాకు మహరాజ్ మూవీకి తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని నిర్మాత నాగవంశీ ట్విటర్లో తెలిపారు. ‘డాకు మహారాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను ఇప్పుడే విన్నాను. మామూలుగా లేదు. జనవరి 12 వరకూ వెయిట్ చేయండి. తమన్ ఇప్పటి వరకూ లేని స్థాయిలో బీజీఎం ఇచ్చారు. థియేటర్లలో శివతాండవమేనమ్మా’ అని ట్వీట్ చేశారు. బాలయ్య హీరోగా వస్తున్న ‘డాకు మహారాజ్’ను బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నారు.
News December 31, 2024
పుట్టిన రోజున వారసుడిని ప్రకటించనున్న దలైలామా?
ఆధ్యాత్మిక గురువు దలైలామా జూలై 6న 90వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన వారసుడిని ప్రకటిస్తారన్న ప్రచారం నడుస్తోంది. చైనాపై నిరసన తెలిపేందుకు ఆ ప్రకటన ఆయనకున్న అవకాశమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. దలైలామా తర్వాతి స్థానంలో ఉండే పాంచెన్ లామాను చైనా ఇప్పటికే ఖైదు చేసింది. వారసుడిని ప్రకటనకు వారిద్దరూ ఉండాల్సిన అవసరం ఉండటంతో లామా ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.