News December 28, 2024

ఎంపీడీవోపై దాడి.. నిందితులకు రిమాండ్

image

AP: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవోపై దాడి కేసులో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు ఇతర నిందితులు భయ్యారెడ్డి, వెంకటరెడ్డికి కూడా రిమాండ్ విధించారు. వీరు ముగ్గురిని కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ పరామర్శించారు.

Similar News

News January 1, 2025

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం

image

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, సుమీ ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. 21 మిస్సైల్స్‌ను మాస్కో ప్రయోగించగా ఆరింటిని తాము నేలకూల్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. దాడిలో ప్రాణనష్టం సంభవించలేదని, ఒకరు గాయపడ్డారని వెల్లడించింది. ఆస్తినష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. ఇక మరో 40 డ్రోన్లతోనూ మాస్కో దాడి చేసిందని, వాటిలో 16 డ్రోన్లను నేలకూల్చామని, 24 డ్రోన్లు తమ వరకూ రాలేకపోయాయని పేర్కొంది.

News January 1, 2025

2025 సాఫీగా సాగేందుకు ఈ మూడూ కీలకం

image

కొత్త ఏడాది వచ్చేసింది. గడచిన కాలం ఎన్నోకొన్ని పాఠాలను మనకు నేర్పింది. వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగితే కొత్త ఏడాది సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా సారీ, థాంక్స్, ప్లీజ్ అనే మూడు పదాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వ్యక్తిత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా అడిగే సమయంలో ఒక ప్లీజ్, తప్పు జరిగినప్పుడు ఒక సారీ, సాయం పొందినప్పుడు ఒక థాంక్స్.. ఈ మూడూ మనిషి గౌరవాన్ని పెంచుతాయని వారు చెబుతున్నారు.

News January 1, 2025

ట్రావిస్ హెడ్ మొత్తం భారతీయుల్ని అవమానించాడు: సిద్ధూ

image

పంత్ వికెట్ తీసిన తర్వాత సెలబ్రేషన్స్‌తో హెడ్ భారతీయులందర్నీ అవమానించారని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు, చిన్నారులు మ్యాచ్ చూస్తుంటారన్న సోయి లేకుండా హెడ్ అసహ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాగా.. వేలికి గాయం కావడంతో ఐస్‌క్యూబ్స్‌లో హెడ్ వేలు పెట్టారని, దాన్ని సెలబ్రేషన్స్ అప్పుడు చూపించారని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వివరణ ఇచ్చారు.