News December 28, 2024

ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని పవన్‌కు వినతి

image

AP: అన్నమయ్య(D) గాలివీడు MPDO కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. నిన్న జవహర్ బాబుపై దాడి ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు పవన్‌ను కోరారు. ఉద్యోగులపై దాడులు చేస్తే తీవ్ర చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 1, 2025

గాయనితో బీజేపీ ఎంపీ పెళ్లికి ముహూర్తం ఖరారు

image

అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీలలో ఒకరైన బీజేపీ నేత తేజస్వీ సూర్య త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఏడాది మార్చి 24న చెన్నైకు చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌, తాను వివాహబంధంతో ఒక్కటవనున్నట్లు ఆయన ప్రకటించారు. తేజస్వి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉండగా, శివశ్రీ గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా రాణిస్తున్నారు.

News January 1, 2025

మరణశిక్షను రద్దు చేసిన జింబాబ్వే

image

జింబాబ్వే మరణ శిక్షను రద్దు చేసింది. ఈ మేరకు బిల్లుపై అధ్యక్షుడు ఎమెర్సన్ నాన్‌గాగ్వా సంతకం చేశారు. ఇప్పటికే మరణశిక్ష పడిన 60మందికి దాన్ని అధికారులు జీవిత ఖైదుగా మార్చనున్నారు. 2005 నుంచి అక్కడ మరణ శిక్షల రద్దు గురించిన చర్చ నడుస్తోంది. వ్యతిరేకత ఉన్నప్పటికీ కోర్టులు మరణశిక్షను విధిస్తూ వచ్చాయి. తాజా చట్టంతో ఇక గరిష్ఠంగా జీవిత ఖైదు మాత్రమే విధించేందుకు వీలుంటుంది.

News January 1, 2025

టెస్టుల్లో 148 ఏళ్లలో తొలిసారిగా గత ఏడాది ఆ ఘనత!

image

గత ఏడాది టెస్టు క్రికెట్లో ఓ ఆసక్తికర రికార్డు నమోదైంది. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా గత ఏడాది 53 టెస్టుల్లో 50 మ్యాచుల్లో ఫలితాలు వచ్చాయి. మూడు మ్యాచులు మాత్రమే డ్రాగా ముగిశాయి. ఇంగ్లండ్ 9 టెస్టులు, భారత్ 8, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక తలో ఆరేసి, బంగ్లా, ఐర్లాండ్, పాక్, వెస్టిండీస్ రెండేసి చొప్పున టెస్టులు గెలిచాయి.