News December 28, 2024
YCP ఫీజు రీయింబర్స్‌మెంట్ ధర్నా వాయిదా
AP: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో జనవరి 3న తమ పార్టీ నిర్వహించాల్సిన ధర్నాను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్ఠానం తెలిపింది. దీనిని అదే నెల 29న నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనవరి 3న విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Similar News
News January 1, 2025
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం
ఉక్రెయిన్ రాజధాని కీవ్, సుమీ ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. 21 మిస్సైల్స్‌ను మాస్కో ప్రయోగించగా ఆరింటిని తాము నేలకూల్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. దాడిలో ప్రాణనష్టం సంభవించలేదని, ఒకరు గాయపడ్డారని వెల్లడించింది. ఆస్తినష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. ఇక మరో 40 డ్రోన్లతోనూ మాస్కో దాడి చేసిందని, వాటిలో 16 డ్రోన్లను నేలకూల్చామని, 24 డ్రోన్లు తమ వరకూ రాలేకపోయాయని పేర్కొంది.
News January 1, 2025
2025 సాఫీగా సాగేందుకు ఈ మూడూ కీలకం
కొత్త ఏడాది వచ్చేసింది. గడచిన కాలం ఎన్నోకొన్ని పాఠాలను మనకు నేర్పింది. వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగితే కొత్త ఏడాది సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా సారీ, థాంక్స్, ప్లీజ్ అనే మూడు పదాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వ్యక్తిత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా అడిగే సమయంలో ఒక ప్లీజ్, తప్పు జరిగినప్పుడు ఒక సారీ, సాయం పొందినప్పుడు ఒక థాంక్స్.. ఈ మూడూ మనిషి గౌరవాన్ని పెంచుతాయని వారు చెబుతున్నారు.
News January 1, 2025
ట్రావిస్ హెడ్ మొత్తం భారతీయుల్ని అవమానించాడు: సిద్ధూ
పంత్ వికెట్ తీసిన తర్వాత సెలబ్రేషన్స్‌తో హెడ్ భారతీయులందర్నీ అవమానించారని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు, చిన్నారులు మ్యాచ్ చూస్తుంటారన్న సోయి లేకుండా హెడ్ అసహ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాగా.. వేలికి గాయం కావడంతో ఐస్‌క్యూబ్స్‌లో హెడ్ వేలు పెట్టారని, దాన్ని సెలబ్రేషన్స్ అప్పుడు చూపించారని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వివరణ ఇచ్చారు.