News December 28, 2024

ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలి: GNT ఎస్పీ

image

ఆటో డ్రైవర్ల ముసుగులో కొంతమంది అసాంఘిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ కల్యాణ మండపంలో శనివారం ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా డ్రైవర్లు వ్యవహరించాలని కోరారు. ప్రయాణీకులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. 

Similar News

News October 29, 2025

నాలుగు నెలల్లో రైతుల ఫ్లాట్లు పంపిణీ చేస్తాం: మంత్రి నారాయణ

image

అమరావతి రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే చర్య అని మండిపడ్డారు. రాబోయే నాలుగు నెలల్లో రైతులందరికీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

News October 29, 2025

రేపటి నుంచి యధావిధిగా పాఠశాలలు: డీఈవో

image

జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు గురువారం నుంచి యధావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను మండల విద్యాశాఖ అధికారులకు పంపించారు. ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాలలకు వెళ్లి అక్కడ పరిస్థితులు గమనించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. పాఠశాల ప్రాంగణంలో శానిటేషన్ పనులు చేయించాలని సూచించారు.

News October 29, 2025

తుళ్లూరులో ఈ నెల 31 జాబ్ మేళా

image

అమరావతి రాజధాని ప్రాంతంలో 380కి పైగా ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు CRDA కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో CRDA సౌజన్యంతో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరు స్కిల్ హబ్‌లో జాబ్ మేళా ప్రారంభం అవుతుందని చెప్పారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.