News December 28, 2024

నితీశ్‌కు YS జగన్ అభినందనలు

image

ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో అదరగొట్టిన భారత క్రికెటర్ నితీశ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ అభినందించారు. ‘మెల్‌బోర్న్‌లో చిన్న వయసులోనే సెంచరీ చేసిన నితీశ్‌కు శుభాకాంక్షలు. 21 ఏళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచస్థాయి జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆయన సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం. నితీశ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని జగన్ ఆకాంక్షించారు.

Similar News

News January 1, 2025

2025 సాఫీగా సాగేందుకు ఈ మూడూ కీలకం

image

కొత్త ఏడాది వచ్చేసింది. గడచిన కాలం ఎన్నోకొన్ని పాఠాలను మనకు నేర్పింది. వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగితే కొత్త ఏడాది సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా సారీ, థాంక్స్, ప్లీజ్ అనే మూడు పదాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వ్యక్తిత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా అడిగే సమయంలో ఒక ప్లీజ్, తప్పు జరిగినప్పుడు ఒక సారీ, సాయం పొందినప్పుడు ఒక థాంక్స్.. ఈ మూడూ మనిషి గౌరవాన్ని పెంచుతాయని వారు చెబుతున్నారు.

News January 1, 2025

ట్రావిస్ హెడ్ మొత్తం భారతీయుల్ని అవమానించాడు: సిద్ధూ

image

పంత్ వికెట్ తీసిన తర్వాత సెలబ్రేషన్స్‌తో హెడ్ భారతీయులందర్నీ అవమానించారని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు, చిన్నారులు మ్యాచ్ చూస్తుంటారన్న సోయి లేకుండా హెడ్ అసహ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాగా.. వేలికి గాయం కావడంతో ఐస్‌క్యూబ్స్‌లో హెడ్ వేలు పెట్టారని, దాన్ని సెలబ్రేషన్స్ అప్పుడు చూపించారని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వివరణ ఇచ్చారు.

News January 1, 2025

గ్రాఫిక్ డిజైనర్.. బతుకుతెరువుకు ఇప్పుడు ఆటోడ్రైవర్!

image

ముంబైకి చెందిన కమలేశ్ కాంతేకర్‌కు గ్రాఫిక్ డిజైనింగ్ ఫీల్డ్‌లో 14 ఏళ్ల అనుభవం ఉంది. అసిస్టెంట్ క్రియేటివ్ మేనేజర్ స్థాయికి వెళ్లిన అతడికి ఆ తర్వాత ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. ప్రయత్నాలు చేసీ చేసీ విసిగిపోయి చివరికి ఓ ఆటోను కొనుక్కున్నాడు. ఎవరి దగ్గరో పనిచేయడం కంటే ఇలా కష్టపడితే ఆత్మగౌరవంతో డబ్బు రెండూ ఉంటాయని, తనను అందరూ దీవించాలని కోరుతూ లింకిడ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టగా అది వైరల్ అవుతోంది.