News December 28, 2024

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్

image

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ కామెంట్స్ సిగ్గుచేటని మండిపడింది. ఆయన మరీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించింది. అంత్యక్రియలపైనా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకే చెల్లిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ అడిగిన మెమోరియల్ నిర్మాణానికి సమయం ఉందని, దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.

Similar News

News January 1, 2025

నేడు దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేడు బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయన అమ్మవారి సన్నిధికి చేరుకుంటారని తెలుస్తోంది. అనంతరం నగర టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసి మాట్లాడనున్నారు. కాగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన కోసం బొకేలు, శాలువాలు, కేకులు తీసుకురావొద్దని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.

News January 1, 2025

గాయనితో బీజేపీ ఎంపీ పెళ్లికి ముహూర్తం ఖరారు

image

అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీలలో ఒకరైన బీజేపీ నేత తేజస్వీ సూర్య త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఏడాది మార్చి 24న చెన్నైకు చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌, తాను వివాహబంధంతో ఒక్కటవనున్నట్లు ఆయన ప్రకటించారు. తేజస్వి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉండగా, శివశ్రీ గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా రాణిస్తున్నారు.

News January 1, 2025

మరణశిక్షను రద్దు చేసిన జింబాబ్వే

image

జింబాబ్వే మరణ శిక్షను రద్దు చేసింది. ఈ మేరకు బిల్లుపై అధ్యక్షుడు ఎమెర్సన్ నాన్‌గాగ్వా సంతకం చేశారు. ఇప్పటికే మరణశిక్ష పడిన 60మందికి దాన్ని అధికారులు జీవిత ఖైదుగా మార్చనున్నారు. 2005 నుంచి అక్కడ మరణ శిక్షల రద్దు గురించిన చర్చ నడుస్తోంది. వ్యతిరేకత ఉన్నప్పటికీ కోర్టులు మరణశిక్షను విధిస్తూ వచ్చాయి. తాజా చట్టంతో ఇక గరిష్ఠంగా జీవిత ఖైదు మాత్రమే విధించేందుకు వీలుంటుంది.