News December 28, 2024

జనంలోకి జనసేనాని

image

AP: కొత్త ఏడాది నుంచి నెలకు ఒక జిల్లాలో పర్యటించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. ప్రజా సమస్యలు, స్థితిగతులను నేరుగా ఆయనే తెలుసుకోనున్నారు. త్వరలోనే పర్యటన షెడ్యూల్, ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News January 1, 2025

తెలుగు భాషను జగన్ భ్రష్టుపట్టించారు: మండలి బుద్ధప్రసాద్

image

AP: మాజీ సీఎం జగన్ తెలుగు భాషను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. ‘విజయవాడలో జరిగిన తెలుగు మహాసభలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అయినా సరే ఆయన వాటిని తెలుగుదేశం మహాసభలంటూ నోరుపారేసుకున్నారు. ఏమీ తెలుసుకోకుండా మాట్లాడటం జగన్‌కు అలవాటు. ఆయన హయాంలో తెలుగు భాషను నాశనం చేసేందుకు యత్నించారు’ అని ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News January 1, 2025

నేడు దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేడు బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయన అమ్మవారి సన్నిధికి చేరుకుంటారని తెలుస్తోంది. అనంతరం నగర టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసి మాట్లాడనున్నారు. కాగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన కోసం బొకేలు, శాలువాలు, కేకులు తీసుకురావొద్దని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.

News January 1, 2025

గాయనితో బీజేపీ ఎంపీ పెళ్లికి ముహూర్తం ఖరారు

image

అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీలలో ఒకరైన బీజేపీ నేత తేజస్వీ సూర్య త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఏడాది మార్చి 24న చెన్నైకు చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌, తాను వివాహబంధంతో ఒక్కటవనున్నట్లు ఆయన ప్రకటించారు. తేజస్వి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉండగా, శివశ్రీ గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా రాణిస్తున్నారు.