News December 28, 2024
విశాఖలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
AP: విశాఖ వాసులకు అలర్ట్. GVMC పరిధిలో జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని మేయర్, కమిషనర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటిని వాడే వారిపై జరిమానా విధించడంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రజలకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.
Similar News
News January 1, 2025
త్వరలోనే కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణ
AP: కోస్తా తీరంలో కీలకమైన కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణకు అడుగులు పడుతున్నాయి. దీనిని 4, 6 వరుసలుగా విస్తరించేందుకు DPR తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఈ రోడ్డు 2 వరుసలుగా ఉంది. 390KM ఉండే ఈ రహదారిలో తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు, రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేపడతారు. అలాగే ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40కి.మీ విస్తరణ కూడా జరగనుంది.
News January 1, 2025
NEW YEAR: తెలుగు సినిమాల కొత్త పోస్టర్లు చూశారా?
న్యూ ఇయర్ సందర్భంగా పలు టాలీవుడ్ సినిమాల నుంచి పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా తదితర సినిమాలు పోస్టర్లను రిలీజ్ చేశాయి. 2025లో మీరు ఏ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.
News January 1, 2025
2025లో మీ రెజల్యూషన్స్ ఏంటి?
కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేశాం. 2025లో మీరు ఏమైనా రెజల్యూషన్స్ పెట్టుకున్నారా? ఏదైనా సాధించాలని, ఉద్యోగం పొందాలని, జీతం పెరిగే ఉద్యోగం దొరకాలని, జీవితం మారాలని, పొదుపు చేయాలని, మందు, సిగరెట్ మానేయాలని, పెళ్లి చేసుకోవాలని, డైట్ ఫాలో కావాలని, జిమ్‌కు వెళ్లాలని, మందు తాగకూడదని, దూరమైన వారితో తిరిగి మాట్లాడాలని.. ఇలా మీ రెజల్యూషన్స్ ఏంటో? కామెంట్ చేయండి. వాటిని ఇవాళ్టి నుంచే ప్రారంభించండి.