News December 28, 2024
కలెక్టర్ పిల్లలైతే ఇలాగే ఊరుకుంటారా?: తల్లి
రాజస్థాన్లో బోరుబావిలో పడిన <<14987957>>చిన్నారి<<>> తల్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కూతురు అందులో పడి 6 రోజులైంది. ఆకలి, దాహంతో ఎంత వేదన అనుభవిస్తుందో? కలెక్టర్ పిల్లలైతే ఇలాగే వదిలేసేవారా?’ అని ఏడుస్తూ ప్రశ్నించారు. తన కూతురిని త్వరగా బయటికి తీసుకురావాలని వేడుకున్నారు. ఈనెల 23న చిన్నారి పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. ఆమెను క్షేమంగా తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Similar News
News January 1, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు
TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు రేపటి నుంచి ఈనెల 20 వరకు జరగనున్నాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 17 జిల్లాల పరిధిలో 92 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి ఉ.11.30 వరకు మొదటి సెషన్, మ.2-సా.4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.
News January 1, 2025
కేరళ నర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష
కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సు 2011లో భర్తతో కలిసి యెమెన్‌లో స్థిరపడ్డారు. ఆదిబ్ మెహదీ అనే స్థానికుడిని భాగస్వామిగా చేసుకుని క్లినిక్ ప్రారంభించారు. భర్త స్వదేశానికి వచ్చిన సమయంలో మెహదీ ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె మత్తు మందు ఇవ్వగా, డోసు ఎక్కువై అతడు మరణించాడు. ఈ కేసు విషయంలో 2017 నుంచి ప్రియ యెమెన్ జైల్లోనే ఉన్నారు. తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆమెకు మరణశిక్ష ఖరారు చేశారు.
News January 1, 2025
వైజాగ్ క్రూజ్ టెర్మినల్ రెడీ
AP: ఎయిర్ పోర్టును తలపించేలా సకల హంగులతో కూడిన క్రూజ్ టెర్మినల్ విశాఖలో రెడీ అయింది. కేంద్ర పర్యాటక శాఖ, వైజాగ్ పోర్టు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. విమానాశ్రయాల తరహాలోనే దీనిలో కస్టమ్స్ కౌంటర్లు, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులు ఉంటాయి. ఈ ఏడాది ఇక్కడ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడి నుంచి విదేశాలకు క్రూజ్ షిప్స్ నడపనున్నారు.