News December 29, 2024

నాగార్జునసాగర్ భద్రతపై కన్ఫ్యూజన్

image

నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం తలెత్తింది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది. డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రి విధుల్లోకి CRPF సిబ్బంది వచ్చి భద్రతా బాధ్యతలు చేపట్టాయి. దీంతో ఏం జరుగుతుందనేది తెలియక స్థానిక అధికారులు అయోమయానికి గురయ్యారు.

Similar News

News January 1, 2025

రేపటి నుంచి టెట్ పరీక్షలు

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు రేపటి నుంచి ఈనెల 20 వరకు జరగనున్నాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 17 జిల్లాల పరిధిలో 92 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి ఉ.11.30 వరకు మొదటి సెషన్, మ.2-సా.4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.

News January 1, 2025

కేరళ నర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష

image

కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సు 2011లో భర్తతో కలిసి యెమెన్‌లో స్థిరపడ్డారు. ఆదిబ్ మెహదీ అనే స్థానికుడిని భాగస్వామిగా చేసుకుని క్లినిక్ ప్రారంభించారు. భర్త స్వదేశానికి వచ్చిన సమయంలో మెహదీ ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె మత్తు మందు ఇవ్వగా, డోసు ఎక్కువై అతడు మరణించాడు. ఈ కేసు విషయంలో 2017 నుంచి ప్రియ యెమెన్ జైల్లోనే ఉన్నారు. తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆమెకు మరణశిక్ష ఖరారు చేశారు.

News January 1, 2025

వైజాగ్ క్రూజ్ టెర్మినల్ రెడీ

image

AP: ఎయిర్ పోర్టును తలపించేలా సకల హంగులతో కూడిన క్రూజ్ టెర్మినల్ విశాఖలో రెడీ అయింది. కేంద్ర పర్యాటక శాఖ, వైజాగ్ పోర్టు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. విమానాశ్రయాల తరహాలోనే దీనిలో కస్టమ్స్ కౌంటర్లు, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులు ఉంటాయి. ఈ ఏడాది ఇక్కడ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడి నుంచి విదేశాలకు క్రూజ్ షిప్స్ నడపనున్నారు.