News December 29, 2024

ఈ రోజు టాప్ న్యూస్

image

* ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
* మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలి: చంద్రబాబు
* డిసెంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
* కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
* మన్మోహన్ సింగ్‌కు రుణపడి ఉంటాం: నారా లోకేశ్
* సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
* డిసెంబర్ 31న పార్టీలు చేసుకోవద్దు: హరీశ్ రావు
* మెల్‌బోర్న్ టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి సూపర్ సెంచరీ

Similar News

News January 1, 2025

మళ్లీ రూ.80 లక్షలకు BITCOIN

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో పుంజుకున్నాయి. మార్కెట్ క్యాప్ 1% పెరిగి $3.26Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ 1.30% ఎగిసి $93,433 (Rs 80L) వద్ద కొనసాగుతోంది. నిన్న $783 (Rs 66K) పెరిగింది. మార్కెట్ డామినెన్స్ 56.72%గా ఉంది. ఎథీరియమ్ 0.24% పెరిగి $3338 వద్ద చలిస్తోంది. మార్కెట్ డామినెన్స్ 12.33%గా ఉంది. XRP 4.17, BNB 0.51, SOL 0.39, DOGE 2.01, ADA 0.70, TRX 0.98% మేర పెరిగాయి.

News January 1, 2025

నేటి(జనవరి 1) నుంచి కొత్త రూల్స్

image

* శాంసంగ్ గెలాక్సీ S3, మోటో G, HTC 1X, మోటో రేజర్ HD, LG ఆప్టిమస్ G, సోనీ ఎక్స్‌పీరియా Z వెర్షన్లలో వాట్సాప్ పనిచేయదు.
* మారుతీ, హోండా, హ్యుందాయ్, మహీంద్రా, MG, TATA, బెంజ్, ఆడికార్ల ధరలు పెరిగాయి.
* TGలోని APGVB శాఖలన్నీ TGBలో విలీనమయ్యాయి.
* అమెజాన్ ప్రైమ్ యూజర్లు ఒకేసారి 2 కంటే ఎక్కువ టీవీల్లో వాడేందుకు అవకాశం లేదు. అయితే డివైజ్‌ల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

News January 1, 2025

బుమ్రాను ఊరిస్తున్న మరో రికార్డు

image

AUSతో జరిగే ఐదో టెస్టులో 3 వికెట్లు తీస్తే బుమ్రా ఖాతాలో మరో రికార్డు చేరుతుంది. BGT చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఆయన నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు హర్భజన్ (32 వికెట్లు, 2000-01 సిరీస్) పేరిట ఉంది. ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు 30W తీశారు. ఆయన ఇంత గొప్పగా రాణిస్తున్నా ఇతర బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్ల నుంచి మంచి ప్రదర్శన రాకపోవడం జట్టును కలవరపెడుతోంది.