News December 29, 2024

రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం: కలెక్టర్

image

సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. పులివెందుల జీజీహెచ్ మార్చురీలో రైతు కుటుంబ సభ్యుల మృత దేహాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అక్కడికి వచ్చిన రైతు కుటుంబ సమీప బంధువులతో మాట్లాడారు. రైతు కుటుంబ నేపథ్యం, వ్యవసాయంలో లాభనష్టాలు, ఆత్మహత్యకు దారితీసిన ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News January 1, 2025

వేముల: ‘మా కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయి’

image

వేముల మండలం మబ్బుచింతలపల్లి గ్రామ సమీపంలోని తోటలో మంగళవారం తెల్లవారుజామున విశ్వజిత్ సాహు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే మృతుని తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు ఉరి వేసుకుని చనిపోయే వ్యక్తి కాదని, మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు. మృతుడి తండ్రి విక్రమ్ కుమార్ ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News January 1, 2025

రైతుల ఆలోచన విధానంలో మార్పు రావాలి: కడప కలెక్టర్

image

రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తే వ్యవసాయంలో అత్యధిక లాభాలు గడించవచ్చని కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. మంగళవారం కడప కలెక్టర్‌లోని తన ఛాంబర్‌లో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించాలని రైతులు ఉపయోగించే పనిముట్లు ఇతర వస్తువులను ఆధునికీకరించే దిశగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, రైతులకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

News December 31, 2024

తిరుపతిలో టోకెన్లు ఇచ్చే లొకేషన్లు ఇవే..!

image

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించి తిరుపతిలో జనవరి 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి టోకెన్లు ఇవ్వనున్నారు. ఆ ఏరియాలు ఇవే..
➤ రామచంద్ర పుష్కరిణి ➤ జీవకోన ZP స్కూల్
➤ ఇందిరా మైదానం ➤ శ్రీనివాసం రెస్ట్ హౌస్
➤ విష్ణునివాసం ➤ 2వ చౌల్ట్రీ
➤ రామానాయుడు హైస్కూల్ బైరాగిపట్టెడ
➤ ఎమ్మార్ పల్లి జడ్పీ స్కూల్