News December 29, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News January 1, 2025
బుమ్రాను ఊరిస్తున్న మరో రికార్డు
AUSతో జరిగే ఐదో టెస్టులో 3 వికెట్లు తీస్తే బుమ్రా ఖాతాలో మరో రికార్డు చేరుతుంది. BGT చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఆయన నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు హర్భజన్ (32 వికెట్లు, 2000-01 సిరీస్) పేరిట ఉంది. ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు 30W తీశారు. ఆయన ఇంత గొప్పగా రాణిస్తున్నా ఇతర బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్ల నుంచి మంచి ప్రదర్శన రాకపోవడం జట్టును కలవరపెడుతోంది.
News January 1, 2025
పేర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు
AP: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మ. 2 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ్టి విచారణకు ఆమె హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
News January 1, 2025
న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం
న్యూ ఇయర్ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల(D) ధర్మపురిలో చర్చి నుంచి బైక్‌పై ఇంటికెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్‌లో చనిపోయారు. మంచిర్యాల(D) దండేపల్లి KGBV వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు, ASF(D) బెజ్జూర్‌లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోని జమ్మలమడుగు(మ) చిటిమిటి చింతల వద్ద డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు.