News December 29, 2024

డిసెంబర్ 29: చరిత్రలో ఈరోజు

image

1844: భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఉమేశ్ చంద్ర బెనర్జీ జననం
1845: అమెరికాలో 28వ రాష్ట్రంగా టెక్సాస్ ఆవిర్భావం
1901: సినీ రచయిత పింగళి నాగేంద్రరావు జననం
1942: బాలీవుడ్ నటుడు రాజేశ్ ఖన్నా జననం
1953: రాష్ట్రాల పునర్విభజనకు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు
1965: తొలి స్వదేశీ యుద్ధట్యాంకు ‘విజయంత’ తయారీ
1974: నటి ట్వింకిల్ ఖన్నా జననం
2022: ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

Similar News

News January 1, 2025

పేర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు

image

AP: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మ. 2 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ్టి విచారణకు ఆమె హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

News January 1, 2025

న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం

image

న్యూ ఇయర్ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల(D) ధర్మపురిలో చర్చి నుంచి బైక్‌పై ఇంటికెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్‌లో చనిపోయారు. మంచిర్యాల(D) దండేపల్లి KGBV వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు, ASF(D) బెజ్జూర్‌లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోని జమ్మలమడుగు(మ) చిటిమిటి చింతల వద్ద డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు.

News January 1, 2025

అజిత్ సినిమా వాయిదా.. గేమ్ ఛేంజర్‌కు బూస్ట్?

image

సంక్రాంతికి (JAN 10) రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు తమిళనాడులో పెద్ద పోటీ తప్పింది. అజిత్ ‘విదాముయార్చి’ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. దీంతో అక్కడ పొంగల్ రేసులో పెద్ద సినిమాలేవీ లేవు. పాజిటివ్‌ టాక్ వస్తే ‘గేమ్ ఛేంజర్’ భారీ వసూళ్లు రాబట్టవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాల దర్శకత్వం వహించిన ‘వనంగాన్’ రిలీజవుతున్నా దాని ప్రభావం GC వసూళ్లపై అంతగా ఉండకపోవచ్చని అంటున్నాయి.