News December 29, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 1, 2025

ఫార్ములా ఈ-రేసు కేసు: రేపటి నుంచి ఈడీ విచారణ

image

TG: ఫార్ములా ఈ-రేసు కేసు విచారణను ఈడీ వేగవంతం చేసింది. రేపటి నుంచి నిందితులను విచారించనుంది. HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి రేపు ఈడీ ముందుకు రానున్నారు. ఎల్లుండి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను, ఈనెల 7న కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. వీరు పెమా చట్టాన్ని ఉల్లంఘించి HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

News January 1, 2025

కోహ్లీ కోసం రోహిత్‌పై చిన్నచూపేలా రవిశాస్త్రీ!

image

విరాట్, రోహిత్‌పై రవిశాస్త్రి భేదభావం చూపుతున్నారని నెటిజన్లు అంటున్నారు. విరాట్ మరో 3-4 ఏళ్లు ఆడగలరని, హిట్‌మ్యాన్ BGT తర్వాత ఆడటంపై నిర్ణయించుకోవాలనడంపై విమర్శిస్తున్నారు. 2024లో వారిద్దరిలో రోహితే బాగా ఆడారంటూ ఫ్యాన్స్ గణాంకాలు చూపిస్తున్నారు. VK బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను రవిశాస్త్రి కొత్తగా స్థాపించిన ‘స్పోర్టింగ్ బియాండ్’ చూసుకుంటుండటంతోనే ఇలా అంటున్నారని ఆరోపిస్తున్నారు. మరి మీరేమంటారు?

News January 1, 2025

న్యూ ఇయర్.. వరుస మూవీల అప్డేట్స్

image

న్యూ ఇయర్ సందర్భంగా సినీ ప్రేమికులకు వరుస గిఫ్టులు వస్తున్నాయి. రాజమౌళి- మహేశ్ కాంబోలో వచ్చే సినిమా షూటింగ్ రేపు ప్రారంభం కానుంది. దీంతోపాటు నాని నటించిన ‘HIT3’ పోస్టర్, ‘బృందావన్ కాలని-2’ నుంచి స్పెషల్ పోస్టర్, ‘ఓ భామ అయ్యో రామ’ నుంచి పోస్టర్, సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ రిలీజ్ డేట్‌తో పోస్టర్ విడుదలైంది. RAPO22 హీరోయిన్‌ను మేకర్స్ రివీల్ చేశారు.