News December 29, 2024
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్?
AP: ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా విజయానంద్ 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.
Similar News
News January 1, 2025
ఇవాళ ఎక్కువ లాభాలొచ్చే బిజినెస్ ఇదే
DEC 31న మందుషాపులపై దండయాత్ర చేసిన యువత నేడు జిమ్ సెంటర్ల వద్ద క్యూ కడుతోంది. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటూ JAN 1 నుంచి జిమ్‌లో చేరేందుకు చాలా మంది మొగ్గుచూపుతుంటారు. దీనికి తగ్గట్లే జిమ్ సెంటర్లు కూడా ఏడాది ఫీజు కట్టేవారికి భారీ డిస్కౌంట్స్ ఇచ్చేస్తుంటాయి. ఎన్నో ఆశలతో జిమ్‌లో చేరిన వారు నాలుగు రోజులకే మానేస్తుంటారు. దీంతో ఇవాళ జిమ్ ఓనర్ల గల్లా పెట్టె నిండిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News January 1, 2025
నితిన్ జీ.. మీ వాగ్దానమేమైంది: నెటిజన్లు
దేశంలోని రోడ్లన్నీ 2024 పూర్తయ్యేసరికి అమెరికా పరిమాణాలను మ్యాచ్ చేసేలా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2022 డిసెంబర్‌లో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, దేశంలోని రోడ్లు ఎంతలా మారిపోయాయో తెలిపే నివేదికను మాత్రం కేంద్రం రిలీజ్ చేయలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో గుంతల రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
News January 1, 2025
టీమ్ఇండియాపై ఇర్ఫాన్ పఠాన్ సీరియస్
BGT టెస్టులో టీమ్ఇండియా ప్రదర్శనపై కోచ్ గౌతమ్ గంభీర్ గుర్రుగా ఉన్నారని, డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులపై సీరియస్ అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే, రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించినట్లు రూమర్స్ వచ్చాయి. ఈ ఘటనపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సీరియస్ అయ్యారు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన విషయాలను బయటకు రానివ్వొద్దు. రూమ్‌కే పరిమితం చేయాలి’ అని సూచించారు.