News December 29, 2024
మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: మల్లు రవి
దివంగత మాజీ పీఎం మన్మోహన్ సింగ్‌కు భారత దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ‘మన్మోహన్ మృతి మన దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలే దేశాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టించాయి. దేశం ఓ మహానేతను కోల్పోయింది. ఆయన సేవలకు ‘భారతరత్న’ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News January 1, 2025
మీకు తెలుగు అంకెలొచ్చా?
ఆర్టీసీ ఓల్డ్ బస్సుల నంబర్ ప్లేట్లను ఎప్పుడైనా గమనించారా? చాలా వాటికి నంబర్లు తెలుగు అక్షరాల్లో ఉంటాయి. కానీ, చాలా మందికి వాటి అర్థాలు తెలియదు. అలాంటివారికోసం తెలుగు అంకెల పట్టికను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. వీటిని నేర్చుకోవడం వల్ల ఏదో ఒక సమయంలో పనికొస్తాయి. ఈ అంకెలు ముందే తెలిసుంటే కామెంట్ చేయండి.
News January 1, 2025
ఇవాళ ఎక్కువ లాభాలొచ్చే బిజినెస్ ఇదే
DEC 31న మందుషాపులపై దండయాత్ర చేసిన యువత నేడు జిమ్ సెంటర్ల వద్ద క్యూ కడుతోంది. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటూ JAN 1 నుంచి జిమ్‌లో చేరేందుకు చాలా మంది మొగ్గుచూపుతుంటారు. దీనికి తగ్గట్లే జిమ్ సెంటర్లు కూడా ఏడాది ఫీజు కట్టేవారికి భారీ డిస్కౌంట్స్ ఇచ్చేస్తుంటాయి. ఎన్నో ఆశలతో జిమ్‌లో చేరిన వారు నాలుగు రోజులకే మానేస్తుంటారు. దీంతో ఇవాళ జిమ్ ఓనర్ల గల్లా పెట్టె నిండిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News January 1, 2025
నితిన్ జీ.. మీ వాగ్దానమేమైంది: నెటిజన్లు
దేశంలోని రోడ్లన్నీ 2024 పూర్తయ్యేసరికి అమెరికా పరిమాణాలను మ్యాచ్ చేసేలా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2022 డిసెంబర్‌లో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, దేశంలోని రోడ్లు ఎంతలా మారిపోయాయో తెలిపే నివేదికను మాత్రం కేంద్రం రిలీజ్ చేయలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో గుంతల రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.