News March 16, 2024

ప్రభాస్ ‘కల్కి’ సినిమాకు ఎన్నికల ఎఫెక్ట్

image

హీరో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో మేకర్స్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఎన్నికల వేడి తీవ్రంగా ఉన్న సమయంలో భారీ బడ్జెట్ సినిమాను విడుదల చేయకపోవడమే ఉత్తమమని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ త్వరలో అఫీషియల్ ప్రకటన చేసే అవకాశముంది.

Similar News

News October 30, 2024

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు

image

ఢిల్లీలో నూతన ఏపీ భవన్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏపీ భవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించుకుంటున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది.

News October 30, 2024

పరువు నష్టం కేసు విచారణ వాయిదా

image

TG: మంత్రి సురేఖ‌పై KTR వేసిన పరువునష్టం దావాపై విచారణను కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఇన్‌ఛార్జి జడ్జి పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్‌ ఓ కారణం అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించాయని KTR ఈ దావా వేసిన విషయం తెలిసిందే. నాగార్జున వేసిన పిటిషన్‌పైనా విచారణ వాయిదా పడింది.

News October 30, 2024

కన్నడ నటుడు దర్శన్‌కి మధ్యంతర బెయిల్

image

కన్నడ నాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. వెన్నెముక శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని ఆయన కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది. 6 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం దర్శన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా రేణుకా స్వామి మర్డర్ కేసులో జూన్ 11న దర్శన్ అరెస్టయిన సంగతి తెలిసిందే.