News December 29, 2024

14,300 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ విగ్రహం

image

భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సో సరస్సు తీరం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నెల 26న ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్, మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ కమాండర్లు విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆర్మీ పేర్కొంది. విగ్రహం బలగాల్లో స్ఫూర్తి నింపడంతో పాట భారత వీరత్వాన్ని ప్రత్యర్థులకు గుర్తుచేస్తుందని స్పష్టం చేసింది.

Similar News

News January 1, 2025

GOOD NEWS: ఎయిరిండియా విమానాల్లో వైఫై

image

విమాన ప్రయాణికులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. తాము ఆపరేట్ చేసే డొమెస్టిక్ ఫ్లైట్లలో నేటి నుంచి వైఫై సర్వీసులను ప్రారంభించామని వెల్లడించింది. దీంతో డొమెస్టిక్ ఫ్లైట్లలో వైఫై కనెక్టివిటీ తెచ్చిన తొలి ఎయిర్‌లైన్ కంపెనీగా నిలిచింది. ఎయిరిండియా A350, B787-9, A321neo ఎయిర్‌క్రాఫ్టుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో 10వేల అడుగుల ఎత్తులో కూడా కాల్స్, మెసేజెస్ చేసుకోవచ్చు.

News January 1, 2025

ప్రజలకు CBN నూతన సంవత్సర కానుకలివే.. వైసీపీ సెటైర్లు

image

AP: ఆరు గ్యారంటీలను గాలికొదిలేసిన మోసం స్టార్ CBN కొత్త సంవత్సర కానుకగా వెన్నుపోటు అస్త్రాలను ప్రజలపైకి సంధిస్తున్నారని YCP విమర్శించింది. ‘6 నెలల్లో ₹1.12L Cr అప్పు. ₹15K Cr విద్యుత్ ఛార్జీల భారం. రోడ్ ట్యాక్స్, బీచ్ ఎంట్రీ ఫీజులు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు. గిట్టుబాటు ధరకు మంగళం. ₹కోట్లలో ఆరోగ్యశ్రీ, రీయింబర్స్‌మెంట్ బకాయిలు. ఇవే ప్రజలకు బాబు సూపర్ సిక్స్ కానుకలు’ అని సెటైర్లు వేసింది.

News January 1, 2025

అత్యంత వేడి సంవత్సరంగా 2024: IMD

image

భారత్‌లో 2024 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు నమోదు చేసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 1901 నుంచి చూసుకుంటే సగటు ఉష్ణోగ్రత కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. 2016లో 0.54 డిగ్రీ సెల్సియస్ నమోదవ్వగా తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయింది. కాగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా 2024లో సగటు కన్నా 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు యూరోప్ ఏజెన్సీలు తెలిపాయి.