News December 29, 2024

పెళ్లిలో విందు బాలేదని గొడవ.. ఆ వెంటనే వరుడికి మరో పెళ్లి!

image

యూపీలోని చందౌలీ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. మెహతాబ్ అనే వరుడికి 7నెలల క్రితం స్థానిక యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి రోజున అతడి కుటుంబీకులు విందు విషయంలో ఆడపెళ్లివారితో గొడవపడ్డారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా పెళ్లి ఆపేశారు. ఆ రాత్రే మెహతాజ్ వేరే అమ్మాయిని రహస్యంగా పెళ్లాడాడు. దీంతో పెళ్లి రద్దుకోసం అతడి కుటుంబీకులు డ్రామా ఆడి తమను మోసం చేశారని ఆడపెళ్లివారు పోలీసుల్ని ఆశ్రయించారు.

Similar News

News January 1, 2025

మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు.. సీఎం ఆదేశాలు

image

TG: హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్, శామీర్‌పేట్‌కు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్యారడైజ్ నుంచి తాడ్‌బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ (23 కి.మీ.), JBS నుంచి కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్‌పేట్ (22 కి.మీ.) వరకు రెండు కొత్త కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే DPRలు సిద్ధం చేసి, కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

News January 1, 2025

తమ్ముడితో హీట్ ఫైటింగ్.. బ్రదర్స్‌తో కూల్ మీటింగ్

image

ప్రత్యర్థి ఆటగాళ్లతో ఫైటింగ్ గ్రౌండ్ వరకే పరిమితమని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. మెల్‌బోర్న్ టెస్టులో ఆసీస్ ప్లేయర్ శామ్ కోన్ట్సస్‌‌ను కోహ్లీ ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ముగిశాక అతని సోదరులు బిల్లీ, జానీ రన్ మెషీన్‌ను కలిసి ఫొటో దిగారు. అతనితో సరదాగా మాట్లాడారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోహ్లీ గ్రౌండులో ఏం చేసినా జట్టు కోసమేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

News January 1, 2025

తొలి క్యాబినెట్ భేటీ రైతుల శ్రేయస్సుకు అంకితం: ప్రధాని మోదీ

image

రైతులకు మేలు చేస్తూ కేంద్ర క్యాబినెట్ <<15038464>>తీసుకున్న నిర్ణయాలపై<<>> ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పూర్తి కట్టుబడి ఉంది. మన దేశానికి ఆహారం అందించడానికి కష్టపడి పనిచేసే రైతు సోదర, సోదరీమణులను చూసి గర్విస్తున్నాం. 2025లో మొదటి క్యాబినెట్ సమావేశాన్ని అన్నదాతల శ్రేయస్సు కోసం అంకితం చేశాం’ అని ట్వీట్ చేశారు.