News December 29, 2024
పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు: నాదెండ్ల
వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘కుట్రలు చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. తప్పు చేయకపోతే నాని జరిమానా ఎందుకు కట్టారు? ఆ గోడౌన్‌ను తన భార్య పేరుతో ఎందుకు తీసుకున్నారు? ఎవరి పేరిట ఉంటే వారిపైనే కేసులు నమోదవుతాయి. గిడ్డంగుల తనిఖీల అనంతరం నోటీసులిచ్చినా నాని ఎప్పుడూ స్పందించలేదు. YSRCP ఐదేళ్లపాటు అరాచకపాలన సాగించింది’ అని విమర్శించారు.
Similar News
News January 1, 2025
దిల్ రాజు కాదు డీల్ రాజు: బీఆర్ఎస్ నేతలు
TG: రాజకీయాల కోసం సినిమాలు వాడుకోవద్దన్న సినీ నిర్మాత, FDC ఛైర్మన్ <<15030891>>దిల్ రాజు వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దిల్ రాజు కాంగ్రెస్ తొత్తుగా మారారని దుయ్యబట్టారు. మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆయన దిల్ రాజు కాదు డీల్ రాజు అని క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సెటైర్లు వేశారు.
News January 1, 2025
దావోస్‌కు వెళ్లనున్న CBN, లోకేశ్
AP: జనవరి 20 నుంచి 24 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. ఇందుకోసం ఈ నెల 19న సీఎం, లోకేశ్, పరిశ్రమలు, ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు అక్కడికి బయల్దేరనున్నారు. సాంకేతిక పాలన, రెన్యువబుల్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ఇందుకోసం కేంద్రం సదస్సులో ఏపీకి స్టాల్ రిజర్వ్ చేసింది.
News January 1, 2025
మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు.. సీఎం ఆదేశాలు
TG: హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్, శామీర్‌పేట్‌కు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్యారడైజ్ నుంచి తాడ్‌బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ (23 కి.మీ.), JBS నుంచి కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్‌పేట్ (22 కి.మీ.) వరకు రెండు కొత్త కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే DPRలు సిద్ధం చేసి, కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.