News December 29, 2024
వచ్చే నెల 20న దావోస్‌కు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ వచ్చే నెల 20న దావోస్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సులో ఆయన, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని తీసుకురావడమే ఈ పర్యటన లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సదస్సులో ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి.
Similar News
News January 1, 2025
మన్మోహన్ మెమోరియల్ కోసం 2 ప్రాంతాలను ప్రతిపాదించిన కేంద్రం
మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్ సింగ్ మెమోరియల్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. నిర్మాణం కోసం 2 ప్రాంతాలను ప్రతిపాదిస్తూ ఆయన కుటుంబానికి సమాచారం ఇచ్చింది. రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్, కిసాన్ ఘాట్ ప్రాంతాల్లో 1-1.5 ఎకరాల స్థలాలను కేంద్రం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీటిలో ఒకదాన్ని మన్మోహన్ ఫ్యామిలీ సెలక్ట్ చేయాల్సి ఉంది. అనంతరం నిర్మాణ పనులను కేంద్రం ప్రారంభించనుంది.
News January 1, 2025
98.12శాతం రూ.2వేల నోట్లు వెనక్కి!
నిన్నటి వరకు 98.12 శాతం రూ.2వేల నోట్లు వెనక్కి తీసుకున్నట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. 2023 మే 19న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు వాడుకలో ఉండగా ఆర్బీఐ ఆదేశాలతో చాలా మంది ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు.
News January 1, 2025
అనంత్ వాచ్ ధర రూ.22 కోట్లు!
భారత సంపన్నుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఇటీవల ధరించిన వాచ్ ధర వార్తల్లో నిలిచింది. మహా అయితే కోటో.. రెండు కోట్లో ఉంటుందిలే అనుకుంటున్నారా? అస్సలు కాదు. దీని ధర అక్షరాలా రూ.22 కోట్లు. స్విట్జర్‌లాండ్‌లోని రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన RM 52-04 వాచ్ ఇది. డయల్ లోపల పుర్రె ఆకారం, స్కైబ్లూ కలర్‌లో కనిపించే ఇలాంటి చేతి గడియారాలు ప్రపంచంలో కేవలం మూడే ఉన్నాయట. ఎంతైనా అంబానీ.. అంబానీయే!