News December 29, 2024

నిఘా నీడలో హైదరాబాద్!

image

మహా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్‌, సరూర్‌నగర్‌ పబ్‌లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వేడుకల పేరుతో డ్రగ్స్‌ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులను ఆదేశించారు.

Similar News

News January 1, 2025

సికింద్రాబాద్: 84 మంది పిల్లలను రక్షించిన RPF

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో 2024లో “ఆపరేషన్ స్మైల్” “ముస్కాన్” కార్యక్రమాల ద్వారా 84 పిల్లలను రక్షించారు. ఇందులో 59 బాలురు, 25 బాలికలు ఉన్నారు. రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ (RPF), చైల్డ్ లైన్ స‌హా వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యాచరణను చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను హత్తుకు చేర్చుకున్నారు.

News January 1, 2025

HYD: JAN 3 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

image

ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు 2025 జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని HICC వేదికగా జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరినీ ఏకం చేసి తెలుగు భాష, సంప్రదాయం, సాహిత్యం, కళలను బలోపేతం చేయడంతో పాటు వాటిని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహకులు తెలిపారు.

News January 1, 2025

ఈనెల 3న చలో కలెక్టరేట్ల ముట్టడి: ఆర్ కృష్ణయ్య

image

విద్యార్థుల ఫీజుల బకాయిలను వెంటనే చేల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం బషీర్‌బాగ్‌లో ఈ ముట్టడికి సంబందించిన కరపత్రం ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి గత 2ఏళ్లు ఫీజుల బకాయిలు రూ. 4వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.