News December 29, 2024
నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

TG: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామి వివాహం నిర్వహించనున్నారు. దీంతో మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.
Similar News
News April 20, 2026
ఇండియా ఆఫర్‌ను తిరస్కరించా: రషీద్ ఖాన్

భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సిటిజన్‌షిప్ ఆఫర్లను తాను తిరస్కరించానని రషీద్ ఖాన్ తెలిపారు. ఈ 2 దేశాల తరపున ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా వద్దని చెప్పినట్లు తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ‘నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 IPL సమయంలో ఇండియన్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు సిటిజన్‌షిప్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు.
News April 20, 2026
ఇరాన్ షిప్‌ను స్వాధీనం చేసుకున్నాం: ట్రంప్

హార్ముజ్ జలసంధిలో తమ దిగ్బంధనాన్ని దాటుకొని వెళ్లేందుకు యత్నించిన ఇరాన్ నౌక ‘టౌస్కా’ను స్వాధీనం చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వార్నింగ్స్ ఇచ్చినా వినకపోవడంతో తమ నేవీ రంగంలోకి దిగినట్లు చెప్పారు. తమ USS Spruance డెస్ట్రాయర్ ద్వారా ఇరాన్ షిప్ ఇంజిన్‌రూమ్‌పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ స్వాధీనంలో ఉన్న ఆ నౌకలో ఏముందో పరిశీలిస్తున్నట్లు తెలిపారు.