News March 16, 2024
కలిసొస్తుందా? ఖర్చు పెరుగుతుందా?
తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. గతంలో మాదిరి ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. అనూహ్యంగా ఈసీ మేలో పోలింగ్ తేదీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారానికి ఈ గ్యాప్ తమకు కలిసి వస్తోందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రచారం, సభలు, కార్యకర్తలకు వసతి, ఆహారం సహా పలు అంశాల్లో ఖర్చు పెరుగుతుందనే ఆందోళన కూడా వారిలో ఉంది. మే 11 వరకు AP, TSలో ప్రచారం చేసుకోవచ్చు.
Similar News
News October 31, 2024
మయోనైజ్ గురించి తెలుసా?
బర్గర్లు, శాండ్‌విచ్‌లు, సలాడ్లలో మయోనైజ్ వేసుకుని తింటారు. పచ్చి గుడ్డులోని తెల్లసొనను నూనె, వెనిగర్/నిమ్మరసం, నీటిలో కలిపితే ఇది తయారవుతుంది. దీన్ని తయారుచేసిన 3, 4 గంటల్లోనే వినియోగించాలని లేదంటే సాల్మనెల్లా, లిస్టెరియా మోనోసైటోజెన్, స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే ప్రమాదకర బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా డయేరియా, కడుపునొప్పి లాంటి సమస్యలు వస్తాయి. తాజాగా TG ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది.
News October 31, 2024
వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ
AP: రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని పేర్కొంది. ఈ సాయం పొందే పండితులు వారి నివాసానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలంది.
News October 31, 2024
ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు
కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.