News December 29, 2024
సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు
TG: సంక్రాంతి పండుగకు 5వేల ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏయే రూట్లలో ఇవి నడుస్తాయి? ఛార్జీలు ఎలా ఉంటాయి? తదితర ప్రశ్నలపై అధికారులు త్వరలో స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీకి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి.
Similar News
News January 1, 2025
జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే..
జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30న పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్-2బీ నిర్వహిస్తామని పేర్కొంది. రెండు విడతల్లో ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.
News January 1, 2025
సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ ఎప్పుడంటే
సంక్రాంతికి తెలంగాణ-ఏపీ మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. ఈ నెల 9, 11న కాచిగూడ-కాకినాడ, 10న హైదరాబాద్(నాంపల్లి)-కాకినాడ మధ్య నడవనున్నట్లు పేర్కొంది. 10, 12 తేదీల్లో కాకినాడ-కాచిగూడ, 11న కాకినాడ-హైదరాబాద్ మధ్య నడవనున్నట్లు తెలిపింది. రేపు ఉదయం 8గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయంది. ఈ రైళ్లు మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి స్టేషన్ల మీదుగా వెళ్తాయి.
News January 1, 2025
ఈరోజు నుంచి ఇలా చేస్తే బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్ దరిచేరవు!
న్యూఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని వాగ్దానాలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రోజుకు 10వేల అడుగులు నడుస్తామని ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నారు. ఒక దగ్గర కూర్చోకుండా శరీరాన్ని కదిలించాలి. రోజూ నడవడం వల్ల అధిక బరువు, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, క్యాన్సర్‌తో పాటు అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిపారు.