News March 16, 2024

క్రిమినల్ కేసులుంటే పార్టీ వెబ్‌‌సైట్‌లో వివరాలు పెట్టాలి: CEC

image

AP: అభ్యర్థులు క్రిమినల్ కేసులుంటే పేపర్, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని రాష్ట్ర CEC ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ‘క్రిమినల్ కేసులుంటే ఆయా పార్టీల వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచాలి. రాష్ట్రంలో 46 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత పెంచుతాం. 4లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నాం. ఇప్పటివరకు రూ.164 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నాం’ అని వెల్లడించారు.

Similar News

News October 15, 2025

తాజా రౌండప్

image

* TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మూడో రోజు 11 నామినేషన్లు.. మొత్తంగా 32 నామినేషన్లు దాఖలు
* రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 సెంటర్లలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు
* బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: రఘోపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
* వరుస నష్టాలకు బ్రేక్.. నిఫ్టీ 178 పాయింట్లు, సెన్సెక్స్ 575 పాయింట్లు అప్

News October 15, 2025

బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంలో విచారణ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించనుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9పై హైకోర్టు ఇటీవల స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News October 15, 2025

కల్తీ మద్యం.. ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు

image

AP:* క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మాలి
* ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా సీసాపై కోడ్ స్కాన్ చేయాలి
* విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించినట్లు ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలి
* ప్రతి దుకాణం, బార్‌లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు
* మద్యం దుకాణాల్లో ర్యాండమ్‌గా ఎక్సైజ్ శాఖ తనిఖీలు
* నకిలీ మద్యం గుర్తిస్తే షాపు లైసెన్స్ రద్దు