News December 29, 2024
గుంటూరు: విద్యార్థినిని గర్భిణి చేసిన ఫుడ్ డెలివరీ బాయ్

10th విద్యార్థినిని గర్భిణి చేసిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఇమ్మానియేల్ పేటకు చెందిన అజయ్ కుమార్ చదువు మానేసి ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల నుంచి అదే ప్రాంతానికి చెందిన విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడి చేశాడు. కడుపు నొప్పి రావడంతో బాలికను ఆసుపత్రికి తరలించే లోపు ఇంట్లోనే ప్రసవించిందన్నారు.
Similar News
News February 18, 2026
హాట్ టాపిక్‌గా మారిన MLA గళ్లా మాధవి ర్యాంక్

TDPలో గుంటూరు వెస్ట్ MLA గళ్లా మాధవి ర్యాంక్ హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి క్షమాపణలు చెప్పాలంటూ చేపట్టిన ఆందోళన ఘటనలో మాధవి హైలెట్‌గా నిలిచారు. అయితే MLAల పనితీరుపై తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్‌లో మాధవికి B గ్రేడ్ రావడంతో క్యాడర్ నిరుత్సాహపడినట్లు చర్చ సాగుతోంది. దీంతో మాధవి ఫైర్ బ్రాండ్ అంటూ మురిసిపోయిన TDP నేతలు ఇప్పుడేమంటారని YCP నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
News February 18, 2026
గుంటూరు DMHO వేటుకు కారణం అదేనా..?

గుంటూరు DMHO బదిలీ అయిన విషయం తెలిసిందే. తురకపాలెంలో ప్రబలిన జ్వరాలను గుర్తించి ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు మృత్యువు భారిన పడుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో విజయలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గతంలో నేరుగా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌కు ప్రత్తిపాడు MLA రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులున్నాయి.
News February 18, 2026
గుంటూరు: సిగరెట్ ధరల పెరుగుదల.. వినియోగదారులకు భారం

కేంద్ర బడ్జెట్‌లో పన్నులు పెరగడంతో గుంటూరు జిల్లాలో సిగరెట్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. GST, ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో ప్యాకెట్ల ధరలు రూ.20 నుంచి రూ.50వరకు అధికమయ్యాయి. కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి ఇంకా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుకాణానికో రేటు ఉండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ చర్యలతో ధూమపానం తగ్గించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.


