News December 29, 2024

సంక్రాంతి పండుగ.. హోటల్స్‌కు ఫుల్ డిమాండ్

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని హోటల్స్, లాడ్జిలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇక్కడి ఉత్సవాలు, కోడిపందేలను తిలకించేందుకు రాష్ట్రాంలోని పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో రూమ్‌ల అద్దెలు కొండెక్కాయి. మండపేట, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు తదితర ప్రాంతాల్లో 4 రోజులకు రూ.వేలల్లో అద్దెలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లతో హోటల్స్ బుక్ అయిపోయాయి.

Similar News

News January 4, 2025

ప్రత్తిపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోషి మాతా దేవాలయం వద్ద హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News January 3, 2025

రాజానగరం హైవేపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

రాజానగరం గైట్ కళాశాల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రేడుకు చెందిన భరత్ చంద్ర (20) మృతి చెందాడు. స్నేహితుడి నాగేంద్రతో కలసి బైక్‌పై రాజానగరం నుంచి రాజమండ్రి వెళుతూ ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో బైక్ హేండిల్ లారీకి తగిలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో లారీ భరత్‌పై నుంచి వెళ్లిపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 

News January 3, 2025

రాజమండ్రి : ‘గేమ్ ఛేంజర్’ పాసుల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు

image

రాజమండ్రిలో జరగబోయే గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసేందుకు మెగా ఫ్యాన్ రెడీ అవుతున్నారు. ఈవెంట్ పాసులు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం లోకల్ లీడర్ల చుట్టూ మెగాభిమానులు, జనసైనికులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అందరికీ పాస్‌లు అందించలేక నాయకులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.