News March 16, 2024

NGKL: భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్ తన భార్య భారతిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు భారతి 5 నెలల గర్భిణి. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 22, 2026

పాలమూరు కార్పొరేటర్‌కు ఫుల్ డిమాండ్

image

పాలమూరు కార్పొరేషన్​లో కార్పొరేటర్​ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి డివిజన్​ నుంచి ఒక్కోపార్టీ తరఫున ఐదారుగురు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని డివిజన్లలో 10 మందికిపై గానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్​గా మారింది. కాంగ్రెస్ 373 మంది, BJP నుంచి 250 మంది దరఖాస్తు చేసుకోగా, BRS నుంచి 446 మంది దరఖాస్తు చేసుకున్నారు.

News January 21, 2026

మహబూబ్‌నగర్: ‘నియమాలు పాటిస్తేనే ప్రయాణం సురక్షితం’

image

ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు వేచి చూస్తుంటారన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. నిర్లక్ష్యం వీడి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.

News January 20, 2026

మన్యం కొండ బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

image

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. లక్షలాది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున రథోత్సవం శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.