News March 16, 2024

వైఎస్ జగన్ రాజకీయ చరిత్ర ఇదే

image

వైఎస్ జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్‌లో ప్రారంభించి, 2009 మే నెలలో తొలిసారిగా కడప ఎంపీగా గెలిచారు. అనంతరం 2011 ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారు. 2014 పులివెందుల ఎమ్మెల్యేగా 75,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో, 2019లో 90,110 భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా జగన్ చరిత్ర సృష్టించారు.

Similar News

News August 30, 2025

BREAKING: బద్వేల్ జనసేన ఇన్‌ఛార్జ్ మృతి

image

బద్వేల్ నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ బసవి రమేశ్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం అతను మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకుముందు ఆయన అనారోగ్య పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అనంతరం చికిత్స కోసం రూ.2 లక్షల సాయం చేశారు. అతని మృతి బాధాకరమని కార్యకర్తలు అన్నారు.

News August 30, 2025

అల్లు అర్జున్ కుటుంబానికి శ్రీనివాసరెడ్డి పరామర్శ

image

నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మృతి చెందారు. హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు & కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబీకులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News August 30, 2025

మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన

image

వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో సెప్టెంబర్ 1, 2 వ తేదీలలో పర్యటించనున్నారు. లింగాలలోని అంబకబల్లె గ్రామంలో స్థానికులతో సమావేశమై సమస్యలు తెలుసుకోనున్నారు. కార్యకర్తలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.