News December 29, 2024
నేరాలు పెరిగాయి: NLG ఎస్పీ
నల్గొండ జిల్లాలో గడిచిన ఏడాది నేరాలు పెరగ్గా, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. మహిళలపైన లైంగిక దాడులు, హత్యలు ఎక్కువగానే జరిగాయన్నారు. దోపిడీలు, దొంగతనాలు కూడా గతేడాదితో పోల్చితే పెరిగాయని తెలిపారు. 2024లో జిల్లాలో 33 హత్యలు, 100 లైంగిక దాడులు, 657 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండను నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Similar News
News January 3, 2025
ఈనెల 10న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 10న వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 5:15 లకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించుటకు ఏర్పాటు కొనసాగిస్తున్నారు. అలాగే ఐదు రోజులపాటు అధ్యాయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి భాస్కరరావు తెలిపారు.
News January 3, 2025
సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం
సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం నాగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 నుంచి 3:30 వరకు వ్యాక్సినేషన్ నిర్వహించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు.
News January 3, 2025
NLG: సంక్రాంతికి ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్కువ సంఖ్యలో సొంత ఊళ్లకు చేరుకునేందుకు అవకాశముందని భావించిన ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.