News December 29, 2024

జూబ్లీహిల్స్‌లో 4 పబ్‌లకు అనుమతి లేదు!

image

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్ లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించాలని పేర్కొన్నారు.

Similar News

News January 4, 2025

శంషాబాద్: కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు

image

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఇద్దరు కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదైంది. ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సదరు అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసి రూ. 4.76 లక్షల స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ అధికారులు వినయ్ కుమార్, ముఖేశ్ కుమార్‌‌గా గుర్తించారు.

News January 4, 2025

రోడ్డు భద్రత సమాజంలో అందరి బాధ్యత: మంత్రి పొన్నం

image

రోడ్డు భద్రత సమాజంలో అందరి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతి పాఠశాలలో యునిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేసి విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పిస్తామన్నారు. తొలి దశలో 500 నుంచి 1000 పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.

News January 4, 2025

యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్

image

తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. మాదాపూర్‌లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1800 మందికి ఉపాధి కల్పిస్తున్న సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్‌సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు.