News December 29, 2024

భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.5

image

AP: పలు ప్రాంతాల్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు హోల్ సేల్ వ్యాపారులకు కేజీ రూ.5‌కే విక్రయిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు KG రూ.8కి కొనాలన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-15 వరకు పలుకుతోంది. పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు వాపోతుంటే, కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 4, 2025

వరల్డ్‌కప్ విజేతలు విక్టరీ పరేడ్‌కు దూరం

image

ICC ఉమెన్స్ వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్‌‌కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్‌లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ర్యాలీ చేపట్టడం లేదని చెబుతున్నారు. రేపు ఢిల్లీలో PM చేతుల మీదుగా టీమ్‌ ఇండియాను సన్మానిస్తారు. తొలిసారి ఉమెన్ వరల్డ్‌కప్ గెలిచినా పరేడ్ లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

News November 4, 2025

మునగాకు పొడితో యవ్వనం

image

ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో మునగాకుపొడి కీలకపాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు బరువు, ఒత్తిడిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ పొడిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, కురులు మెరుపును సంతరించుకుంటాయి. దీంట్లోని విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని యవ్వనంగా మార్చుతాయి.