News December 29, 2024

‘ఆడబిడ్డలకే జన్మనిస్తావా?’.. భార్యకు నిప్పంటించిన భర్త

image

ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే కొందరు తండ్రుల బుద్ధి మాత్రం మారట్లేదు. మగపిల్లలే కావాలంటూ భార్యను కడతేర్చుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని ప‌ర్భానీలో ఉత్త‌మ్ కాలే అనే వ్యక్తి ముగ్గురు ఆడపిల్లలకు జ‌న్మనిచ్చింద‌ని భార్య‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు ర‌క్షించే ప్ర‌య‌త్నం చేసినా ఫలించలేదు. ఆమె సోద‌రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Similar News

News January 4, 2025

బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసింది?: పొన్నం

image

బీసీల విషయంలో బీఆర్ఎస్ తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆ పార్టీ బీసీలకు ఏం చేసిందో చెప్పాలని ఆయన ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌లో బీసీలందరం కలిసి మా హక్కుల కోసం గొంతెత్తగలం. ఇదే స్వేచ్ఛ మీ పార్టీలో బీసీలకు ఉందా? అధికారంలో ఉండగా గుర్తురాని బీసీలు మీకు ఇప్పుడు గుర్తొచ్చారా? రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తే బీసీలు చూస్తూ ఊరుకోరు’ అని హెచ్చరించారు.

News January 4, 2025

‘గేమ్ ఛేంజర్’ తర్వాత శంకర్ పాన్ వరల్డ్ మూవీ?

image

వరస ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టైతే ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టును తీసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘వీరయుగ నాయగన్ వేల్పరి’ అనే పుస్తకం ఆధారంగా 3 భాగాల సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పైనే ఆ ప్రాజెక్ట్ ఆధారపడినట్లు సమాచారం.

News January 4, 2025

మాల్దీవుల ప్రగతికి అండగా ఉంటాం: జైశంకర్

image

మాల్దీవుల ప్రగతికి, సుస్థిరతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్‌ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఆయన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని జైశంకర్ పేర్కొన్నారు. అటు.. భారత్‌తో బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు ఖలీల్ ట్వీట్ చేశారు.