News December 29, 2024
రేవంత్ రెడ్డి చేతగాని పాలన విద్యార్థులకు శాపంగా: హరీష్ రావు

విద్యాశాఖ మంత్రిగా ఉండి వారి భవిష్యత్తును CM రేవంత్ రెడ్డి ప్రశ్నార్థకం చేస్తున్నారని, సీఎం చేతకాని పాలన విద్యార్థులకు శాపంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు. విష ఆహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో విష ఆహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం CM పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు.
Similar News
News March 3, 2026
మెదక్: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.
News March 3, 2026
మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను ఆస్వాదించాలని ఆమె కోరారు.
News March 2, 2026
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు


