News December 29, 2024
త్వరలో 32వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 32,438 గ్రూప్-డి పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాయింట్స్‌మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ వంటి పోస్టులు భర్తీ చేయనుంది. జనవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. పదోతరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. బేసిక్ సాలరీ రూ.18వేలు.
Similar News
News January 4, 2025
చలిపులి.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
TG: రాష్ట్రం చలిపులి గుప్పిట్లోకి చేరుకుంది. వచ్చే 2 రోజుల పాటు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన దుస్తులు వేసుకుని చలి నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు మంకీ క్యాప్‌లు, జెర్కిన్స్, చలి కోట్లు తప్పనిసరిగా ధరించాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప ఉదయం బయటికెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
News January 4, 2025
బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసింది?: పొన్నం
బీసీల విషయంలో బీఆర్ఎస్ తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆ పార్టీ బీసీలకు ఏం చేసిందో చెప్పాలని ఆయన ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌లో బీసీలందరం కలిసి మా హక్కుల కోసం గొంతెత్తగలం. ఇదే స్వేచ్ఛ మీ పార్టీలో బీసీలకు ఉందా? అధికారంలో ఉండగా గుర్తురాని బీసీలు మీకు ఇప్పుడు గుర్తొచ్చారా? రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తే బీసీలు చూస్తూ ఊరుకోరు’ అని హెచ్చరించారు.
News January 4, 2025
‘గేమ్ ఛేంజర్’ తర్వాత శంకర్ పాన్ వరల్డ్ మూవీ?
వరస ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టైతే ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టును తీసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘వీరయుగ నాయగన్ వేల్పరి’ అనే పుస్తకం ఆధారంగా 3 భాగాల సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పైనే ఆ ప్రాజెక్ట్ ఆధారపడినట్లు సమాచారం.