News December 29, 2024
MBNR: కొండెక్కిన గుడ్డు ధర
ఉమ్మడి పాలమూరులో గతంలో ఎప్పుడు లేని విధంగా కోడి గుడ్డు ధర కొండెక్కింది. నూతన సంవత్సర వేడుకల్లో కేకు తయారీలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో మరింత పెరిగే అవకాశం ఉంది. రిటైల్ ధర అక్టోబర్- రూ.6.30, నవంబర్- రూ.6.50, డిసెంబర్- రూ.7.10 పైన ఉంది. కార్తీక మాసం ముగియడంతో మాంసం ధర తగ్గి గుడ్ల ధర గణనీయంగా పెరిగింది. ధర పెరగడంతో గుడ్లు నోటికి అందడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 4, 2025
మహబూబ్‌నగర్: గొర్రెల మందపై చిరుతపులి దాడి
మహబూబ్‌నగర్ జిల్లాలోని నందిపాడు, దోరెపల్లి, గుండుమాల్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. కాగా.. గురువారం రాత్రి కొత్తపల్లితండా మాజీ సర్పంచ్ బెణిక్యానాయక్ పొలంలో గొర్రెల మందపై చిరుత దాడి చేసిందని కాపరులు తెలిపారు. రాత్రుళ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి జంతువుల దాడిలో పశువులు మృతిచెందితే తమకు సమాచారం అందించాలని అటవీ అధికారులు తెలిపారు.
News January 4, 2025
NRPT: చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి రిమాండ్: డీఎస్పీ
నారాయణపేట పట్టణంలోని ఓ కాలనీలో మూడు రోజుల క్రితం ఓ ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. నరేశ్ అనే వ్యక్తి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
News January 4, 2025
ఎర్రవల్లి: ప్రజలకు ఉత్తమ సేవలదించాలి: ఐజీ
కొత్తగా విధుల్లో చేరే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలందించి డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ సూచించారు. హైదరాబాద్, నిజామాబాద్, ములుగు జిల్లాల నుంచి కానిస్టేబుల్స్‌గా ఎంపికైన వారు ఎర్రవల్లి పదో బెటాలియన్‌లో 9 నెలలు శిక్షణ పూర్తి చేశారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.