News December 29, 2024

ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులే: మంత్రి

image

AP: పేర్ని నాని ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతానికి ఎందుకు వెళ్లారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండా 7 వేల రేషన్ బియ్యం బస్తాలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశామని, లోతైన దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులేనని, సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనేనని విమర్శించారు. సానుభూతి కోసం భార్య పేరును వాడుకుంటున్నారని ఫైరయ్యారు.

Similar News

News February 3, 2026

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లో ఉద్యోగాలు

image

<>శ్యామ్ ప్రసాద్<<>> ముఖర్జీ పోర్ట్‌ 4 సీనియర్ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 17 వరకు పోస్ట్ చేయాలి. నెలకు రూ.32,900-రూ.58,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://smp.smportkolkata.in

News February 3, 2026

మార్కెట్లో మాయాజాలం.. గమనించారా?

image

వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు రూ.150 నుంచి రూ.167కు చేరింది. వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.120కు పెరిగింది. అటు వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి ఏకంగా రూ.200కు దూసుకెళ్లాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాముల ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి.

News February 3, 2026

ఇండియాలో ఫార్ములా వన్ రీఎంట్రీ!

image

ఇండియాలోకి ఫార్ములా వన్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్రం, ఫార్ములా వన్ యాజమాన్యం మధ్య ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు క్రీడా శాఖ వెల్లడించింది. 2011లో నోయిడా సర్క్యూట్‌‌లో దేశంలోనే తొలిసారి F1కార్లు పరుగులు తీశాయి. 2013లో చివరి సారిగా రేసు జరిగింది. భారీ పన్నులు, ఇతర సమస్యలతో ఇండియాకు F1 దూరమైంది. 2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు జరిగిన విషయం తెలిసిందే.