News December 29, 2024
8వ జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలు ప్రారంభం
8వ జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలు కర్నూలు బీ.క్యాంపులోని టీజీవీ కళ్యాణ మండపంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జాతీయ రింగ్ పైట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, ప్రభాకర్ హాజరై పోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రాలలో అనేక జాతీయ స్థాయి పోటీలను నిర్విరామంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పోటీల కార్యదర్శి అబ్దుల్లా పాల్గొన్నారు.
Similar News
News January 4, 2025
కబళించిన మృత్యువు!
ఊర్లో దేవర. కొత్త దుస్తుల కోసం ఆ దంపతులు అనంతపురం జిల్లా యాడికి వెళ్లారు. సంతోషంగా తిరుగుపయణం అవగా వారి బైక్‌ను బొలెరో ఢీకొంది. ఈ విషాద ఘటనలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్ (38), సుమలత (35) మరణించారు. కొత్త దుస్తుల కోసం పాఠశాల నుంచి హుషారుగా ఇంటికి వచ్చిన పిల్లలు పూజిత, మిథిల్ తల్లిదండ్రుల శవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులూ అనాథలయ్యారు.
News January 4, 2025
నంద్యాల: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్
నంద్యాల నుంచి దిగువ మెట్ట వెళ్లే మార్గంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు వెల్లడించారు. డోన్ నుంచి గుంటూరు వరకు వెళ్లే రైలులో ఓ వ్యక్తి ప్రయాణం చేశారని చెప్పారు. చలమ నుంచి దిగువమెట్ట వరకు ఉన్న రైలు మార్గంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు.
News January 4, 2025
విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఉండాలి: కలెక్టర్
విద్యార్థులు చదువును విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకుని విద్యనభ్యసిస్తే ఉన్నత స్థితిలో రాణించగలుగుతారని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాలలోని ఎస్పీజీ పాఠశాలలోని జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా మంచిగా చదువుకోవాలని కలెక్టర్ ఉద్బోధించారు.