News December 29, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT

image

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT/PET ఈవెంట్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈవెంట్లకు ఎంపికైన వారు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే గడువు ఇవాళ్టితో ముగిసింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 ఆఫీసు(ఉ.10-సా.6) సమయంలో నంబర్లను సంప్రదించండి.
ALL THE BEST

Similar News

News September 16, 2025

నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC

image

AP: రాష్ట్రంలో 21 ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లైబ్రేరియన్ సైన్స్‌లో జూనియర్ లెక్చరర్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 3, హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని APPSC తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 16, 2025

అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

image

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్‌వెస్టిగేషన్ యూనిట్‌కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్‌షీట్‌ల దాఖలుకు అనుమతినిచ్చింది.

News September 16, 2025

ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి

image

తెలంగాణలో నలుగురు IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. NVS రెడ్డిని HMRL ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయనను ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. HMDA సెక్రటరీగా శ్రీవాత్సవ, SC గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యలకు అదనపు బాధ్యతలిస్తూ నిర్ణయించింది. పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.